ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ పాప నాలుగు నెలల వయసులో వండర్ క్రియేట్ చేస్తోంది. ఒకటి, రెండు వస్తువులు కాదు ఏకంగా 120 వస్తువులను గురించి చెప్పి వరల్డ్ రికార్డ్ సాధించింది. ఆ చిన్నారి కంటి చూపు మెరుగుపర్చడం కోసం సన్నిహితుల సలహాతో బ్లాక్ అండ్ వైట్ కార్డులను చూపించడం మొదలుపెట్టారు పాప తల్లి. తన కుమార్తె ఆ కార్డులను శ్రద్ధగా చూస్తుండటాన్ని గమనించి మరింత తర్పీదునిచ్చింది. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి నిదర్శనం ఈ పాప. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన రమేష్, హోమ దంపతుల కుమార్తె కైవల్య 4 నెలల వయస్సులోనే 120 రకాల పక్షులు, కూరగాయలు, పండ్లు, జంతువులు, పూలు ఫోటోలను గుర్తుపట్టగలుగుతుంది.