హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్.. ఇంటికొచ్చి మరి..

ఎండాకాలం వస్తే గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో.. తాగునీటికి కటకట తప్పదు. జలమండలి విడుదల చేసే తాగునీరు సరిపోక ట్యాంకర్లను ఆశ్రయిస్తుంటారు. అలాంటిది.. తాగునీటి కోసం ఇచ్చే నీటిని వృథా చేస్తే.. అధికారులు ఊరుకుంటారా?. తాట తీస్తామని హెచ్చరించడమే కాదు.. గ్రౌండ్‌ లెవల్లో తనిఖీలు చేస్తూ.. భారీగా ఫైన్లు వేస్తున్నారు.