పాతబస్తీలో రెచ్చిపోయిన కామాంధుడు..

హైదరాబాద్ పాతబస్తీ ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. మహిళలను అసభ్యంగా తాకుతూ ఓ వ్యక్తి పారిపోతున్నాడు. మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌ షాహి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జూలై 25న ఓ మహిళ తన ఇంటి వరండాలోనే బట్టలు ఆరేసుకుంటుండగా.. ఓ కామాంధుడు ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో.. అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు నిందితుడు.