కళ్ల ముందే కుంగిన బ్రిడ్జి.. భయాందోళనలో వాహనదారులు!

వరంగల్-ములుగు మధ్య జాతీయ రహదారి 163 పై ప్రధాన బ్రిడ్జి కుంగిపోయింది. ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం వాహనాలన్నీ పోలీసులు దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి భూపాలపట్నం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం ఏర్పడింది. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామ సమీపంలో బ్రిడ్జి కుంగిపోయింది. జాతీయ రహదారి 163 పై ఎస్సార్‌ఎస్పీ కెనాల్ వద్ద నిర్మించిన వంతెన ఒక్కసారిగా కుంగింది. వంతెనకు ఒకవైపు ఒరగిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. అయితే ఇసుక లారీల ఓవర్ లోడ్ వల్లే ఈ బ్రిడ్జి కుంగిందని స్థానికులు చెబుతున్నారు..