దొంగకు ఆకలి అయితే ఏం చేశారో తెలుసా? నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. అయితే రోజు మాదిరిగానే ఇళ్లలో దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేస్తున్న సమయంలో అలికిడి అయింది. అదే సమయంలో వినాయకుడిని నిమజ్జనం చేసిన యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు. అలికిడి శబ్దం విన్న ఆ యువకులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేస్తుండగా ఆకలి వేస్తుందని ఆ దొంగ కేకలు వేశాడు. దీంతో ఆ యువకులు వినాయక నిమజ్జనం కోసం తయారుచేసిన పులిహోరను దొంగకు తినిపించి దేహశుద్ధి చేసి నార్కట్ పల్లి పోలీసులకు అప్పగించారు.