ఆ చిన్నారి క్రికెట్ షాట్లు చూస్తే ఔరా అనాల్సిందే

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా తమ చుట్టూ తాము గిరిగీసుకుని కూర్చున్న కాశ్మీర్ ప్రజలు తమ ప్రతిభను బయటి ప్రపంచానికి చాటుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల చిన్నారి హర్మత్ ఇర్షాద్ భట్.