ప్రియురాలి కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. వ్యక్తి దారుణ హత్య

ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్‌ఘాట్ పరిధిలో కలకలం రేపింది.