బాంబులతో బస్టాండ్ కూల్చివేత

బాంబులతో బస్టాండ్ కూల్చివేత.. వరంగల్‌ ఆర్టీస్టీ బస్టాండ్‌లో పాత భవనం తొలగింపు పనులు చకచకా జరుగుతున్నాయి. కొత్త బస్టాండ్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్ స్టేషన్ ను అర్ధరాత్రి తర్వాత జనసంచారం లేని సమయంలో జిలెటిన్ స్టిక్స్ వాడి భవనాలను కూల్చి వేశారు. రూ.70కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల మోడల్ బస్ స్టేషన్ నిర్మిస్తున్నారు.