నిండు సభలో కంట తడి పెట్టుకున్న కలెక్టర్‌

పిల్లలపై దురాగతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలలు, బాలికలపై జరుగుతున్న అమానుష సంఘటనల పట్ల ఆవేదనతో కంటతడి పెట్టి కొద్ది సేపు భావోద్వేగానికి లోనయ్యారు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో 6 నెలల పాటు ఉద్యమ కార్యాచరణను అమలు చేపట్టాలని పిలుపునిచ్చారు.