కాలువలో రైతుకు వినిపించిన వింత శబ్ధాలు.. తొంగి చూస్తే.. షాకింగ్‌ సీన్‌..!

అనకాపల్లి జిల్లాలో ఓ రైతుకు గుండె ఆగే పని అయింది. రైవాడ కాలువ సమీపానికి వెళ్లిన.. అతనికి ఏదో వింత శబ్దాలు వినిపించాయి. తొంగి చూసేసరికి ఏదో కదులుతూ ఉన్నట్టు కనిపించింది. కాస్త ఏకాగ్రతతో చూస్తే.. వామ్మో ఒళ్ళు జలదరించే సీన్.. దీంతో స్థానికులకు సమాచారం ఇవ్వడంతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడ కాలువ. అక్కడికి స్థానికులు రైతులు వెళుతూ ఉంటారు. ఆ రోడ్డులో స్థానికులు సంచరిస్తూ ఉంటారు. ఇంతలో ఓ రైతుకు ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న వ్యక్తి ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు. ఏదో కదులుతున్నట్టు కనిపించింది. తొమ్మిది చూస్తే.. భారీ గిరినాగు అతని దృష్టిలో పడింది. దీంతో గుండెలు పట్టుకున్నాడు. స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకింది.