చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు హైదరాబాద్ అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలకు, కళారూపాలకు నిలయం. ఎన్నో పురాతన కట్టడాలతో దేశానికే వారసత్వ సంపదగా భాగ్యనగరం నిలిచిందంటే గర్వకారణం. అంతటి వైభవం కలిగిన కట్టడాలను, కళారూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలుగా మన మీద ఉంటుందనే మాట వాస్తవం. నగరానికే తలమానికంగా నిలిచిన చార్మినార్ కట్టడం గురించి మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందరో సందర్శకుల మదిని దోచుకున్న చార్మినార్ కట్టడం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంటోంది.