పురాణాల్లో సీతాదేవి స్వయంవరం గురించి విన్నాం.. ఈ కలియుగంలో ఒక ఆవుకి స్వయంవరం చేయడం విశేషంగా ఆకట్టుకుంటుంది. కాకినాడకు చెందిన డాక్టర్ గౌరీశేఖర్ పెంపుడు ఆవు సారణ కు అదే స్థాయిలో స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున కళ్యాణ మండపంలో స్వయంవరం వేడుకలు నిర్వహించారు. .ఈ స్వయం వరానికి వివిధ జాతులకు చెందిన 12 నందీశ్వరులతో హాజరయ్యారు రైతులు.