ఏఓబీలో సరుకు తీసుకొని.. ఏజెన్సీ ముందుగా మైదానానికి ప్రయాణమయ్యారు. దాదాపుగా ఏజెన్సీ పూర్తిగా సక్సెస్ఫుల్గా దాటేశారు. ఈలోగా.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివారు కేడీపేట వద్ద పోలీసులు వాహన తనిఖీలు మొదలుపెట్టారు. సిఐ రేవతమ్మ నేతృత్వంలో గొలుగొండ కేడీపేట ఎస్సైలు రామారావు, తారకేశ్వరరావు వాహనాలపై నిఘా పెట్టారు. ఈలోగా చంటిబాబు అండ్ టీం ప్రయాణిస్తున్న కారు అటువైపుగా వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించారు పోలీసులు.