రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న పాములు..!

రిపబ్లిక్ డే సందర్భంగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాల్‌లో నాలుగు జాతుల పాములను ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. జెర్రిపోతూ, రక్తపింజరి, నాగుపాము, బొడ్డ పాములను ప్రదర్శనకు పెట్టారు. పాము కాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏ పాము ఎంతటి అపాయం అన్న దానిపైనా వివరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ కేజ్ లలో ఈ పాములను ఉంచారు. వీటితోపాటు పాముల రకాలతో పోస్టర్ను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. అందరూ ఆ పాములను ఆసక్తిగా తిలకిస్తూనే.. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.