తమ ఇష్టానికి వ్యతిరేకంగా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. ఆమె తల్లిదండ్రులు పగబట్టారు. కూతురి అత్తింటి వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. అడ్డొచ్చిన కూతురి బయటకు ఈడ్డుకుంటూ తీసుకొచ్చి.. ఆమె కాళ్లకు తాడు కట్టి కారులో పడేసి ఎత్తుకెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కిడ్నాప్‌కు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ అమానుష ఘటన బుధవారం (సెప్టెంబర్ 24) నగర శివారులోని కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అసలేం జరిగిందంటే..