అన్‏స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్.. అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు..

ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు తమ పర్సనల్, కెరీర్ విషయాలను బాలయ్యతో పంచుకున్నారు. ఇక ఇప్పుడు అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 4 కూడా రాబోతుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ సీజన్ సరికొత్త ప్రోమోను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్‏స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అతిథిగా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.