క్యాంటీన్‌లో కప్పులు టీ తయారు చేస్తున్న స్టార్ క్రికెటర్లు

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురు కాదు గానీ కళ్లెదుట ఒక వ్యక్తి పోలికలతో ఎవరైనా తారసపడితే మాత్రం మైండ్‌ బ్లాంక్‌ అవ్వడం ఖాయం. అలాంటి ఏకంగా స్టార్ క్రికెటర్ల పోలికలతో బయట ఎవరైనా తారసపడితే ఇంకేం ఉంది.. వీళ్లు అసలా, నకిళీయా అనే డౌట్‌ వెంటాడుతుంది. తాజాగా కొంతమంది భారత స్టార్ క్రికెటర్ల డోపెల్‌గేంజర్‌లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రెటీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పలుమార్లు చక్కర్లు కొట్టాయి. వీరిలో బిగ్‌బీ అమితావ్ బచ్చన్, షారూఖ్ ఖాన్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు.