పాతబస్తీ నాలాలో కనిపించిన సీన్.. పరుగో పరుగు

హైదరాబాద్ మహానగరం పాతబస్తీ బహదూర్‌పురాలో జనావాసాల మధ్య ఓ మొసలి కనిపించి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న నాలాలో మొసలి కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల మధ్యలోకే ఇలా మొసలి రావడం పట్ల భయభ్రాంతులకు గురై ప్రజలు పరుగులు పెట్టారు. చాలా మంది మొసలిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.