భగవంతుణ్ణి పై భక్తి ఒక నమ్మకం. కోటీశ్వరుడి నుంచి కూటికి కూడా ఇబ్బంది పడే పేదవాడి వరకు భగవంతునికి మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ఐశ్వర్యం కోసం...మరి కొందరు ఆరోగ్యం బాగుపడాలని దేవుణ్ణి పై నమ్మకంతో మొక్కులు చెల్లిస్తుంటారు. మరికొందరు భక్తులు కాలి నడకన దైవ దర్శనానికి వెళ్తుంటారు. అలాంటి భక్తితో ఒక అంగ వైకల్యం కలిగిన ఓ పేద భక్తుడు తనకు మించిన సాహాసం చేశాడు.