వరంగల్‌లో ఓ వ్యక్తి పోలీసులకు ఊహించలేక షాక్ ఇచ్చాడు. ఇంట్లోకి చొరబడ్డ వీధి కుక్క ఎంతకు బయటికి వెళ్ళకపోవడంతో డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసులను తన ఇంటికి రప్పించాడు. ఆ కుక్కను వారిచేతే బయటకు వెళ్ళగొట్టించాడు. ఈ విచిత్ర సంఘటన ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాజీపేటలో జరిగింది. ఇంటి యజమాని రాజేంద్రకుమార్ నిర్వాకం చూసిన పోలీసులు బిత్తరపోయారు.