మేడారంలోనే మంత్రి సీతక్క మకాం.. పనుల్లో అధికారుల పరుగో.. పరుగు

వరంగల్ జిల్లా కు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క - కొండా సురేఖ జాతర నిర్వహణ బాధ్యతలు వారి భుజాల పై వేసుకున్నారు. ఇదే ములుగు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క మేడారంలోనే తిష్ట వేశారు.. అన్నీ తానై జాతర అభివృద్ది పనులను చక్కదిద్దుతున్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తు తను కూడా తల్లుల సేవలో తరిస్తున్నారు.