ఎల్లలు దాటిన ప్రేమ.. పెళ్ళితో ఒక్కటైన కోనసీమ కుర్రోడు కెనడా కుర్రది..

ప్రస్తుతం ప్రేమలు పెళ్ళిళ్ళు దేశాలు దాటి ఖండాంతరాలకు చేరుకున్నాయి. గత కొన్ని ఏళ్లుగా మన దేశానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు విదేశాలకు చదువుల కోసం లేదా ఉద్యోగాల కోసం వెళ్లి.. అక్కడ విదేశీ యువతీ యువకుల ప్రేమలో పడుతున్నారు. తమ పెద్దలను ఒప్పించి ఆ ప్రేమని పెళ్ళిగా అది కూడా హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటున్న జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కోనసీమ జిల్లా వేదికగా కోనసీమ కుర్రోడు విదేశీ అమ్మాయిని పాణిగ్రహం చేసుకున్నాడు.