తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును కాల్చి బూడిద చేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి రూ.4 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘి అనే స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. ఆ కారుపై మోజు తీరడంతో అమ్మేలానుకున్నాడు.