వరంగల్ నగరంలోని సికేఎం ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి ఇన్ పేషెంట్ వార్డులో ఎలుకల స్వైర విహారం చేస్తున్నాయి. పసిపిల్లల ఆరోగ్యం మెరుగవడం కోసం ట్రీట్మెంట్ అందించే ఇంక్యుబేటర్ వార్డులో ఈ విధంగా మూషిక సేనలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసిపిల్లల తల్లులు కాస్త వేమరపాటుగా ఉంటేచాలు చిన్నారులను రక్కి గాయపరుస్తున్నాయి. ఇక్కడ పసిపిల్లల ప్రాణాల కోసం బాలింతలు, వాళ్ళ అటెండెన్స్ కాపలా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎలుకల బారి నుండి పసి పిల్లల ప్రాణాలు కాపాడుకోవడం కోసం పడరాని పాట్లు పడుతున్నారు ఈ తల్లులు