నన్ను గెలిపించండి.. మీ ఇంటి నీటి పన్ను నేనే చెల్లిస్తా-సర్పంచ్ అభ్యర్థి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. దీంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల వ్యూహాలను రచిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇలానే సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడిన ఒక వ్యక్తి ఎన్నికల్లో తనను సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామంలోని అందరి ఇంటి నీటి పన్నులు తానే చెల్లిస్తానని హమీ ఇచ్చాడు.