ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దంతేవాడలో లో 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ముందు వాళ్లు లొంగిపోయారు. ఎస్పీ ముందు లొంగిపోయిన మావోయిస్టులలో 50మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారు..వీరిలో 30 మందిపై రూ.64లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.