కేంద్ర బడ్జెట్‌పై అధికార , విపక్షాల మధ్య మాటలయుద్దం మరింత ముదిరింది. విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో తీరని అన్యాయం జరిగిందని కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. రాజ్యభలో కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే. రెండు రాష్ట్రాలకు మాత్రమే వడ్డించి మిగతా రాష్ట్రాలను విస్మరించారని అన్నారు.