ఇదేంట్ర సామీ! ఇలాంటి బెట్టింగ్ కూడా ఉంటుందా..?

పేకాట, క్రికెట్ బెట్టింగ్, పొలిటికల్ బెట్టింగులలో ఇప్పటి వరకు ఇలాంటి బెట్టింగ్ ఎవరూ చూసి ఉండరు..! రాజకీయాల్లో గెలుపు, ఓటములపై పందెలు కాయడం సహజం. కానీ ఓ వ్యక్తి బెట్టింగ్ బంగార్రాజులకే ట్రెండ్ సెట్ చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డికి రాదని ఓ వ్యక్తి పందెం వేశాడు. శ్రీధర్ రెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇస్తే, అరగుండు కొట్టించుకుంటానని, సగం మీసం తీసేస్తానని పందెం కాశాడు. చివరికి వైసీపీ అధిష్టానం పుట్టపర్తి వైసీపీ టికెట్ శ్రీధర్ రెడ్డి పేరు ఖరారు చేసింది. అన్న మాట ప్రకారం శ్రీధర్ రెడ్డికి టికెట్ వచ్చినందున అరగుండు కొట్టించుకుని, సగం మీసం తీయించుకున్నాడు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి.