వాటర్ బాటిల్ కోసం వచ్చి.. ఏకంగా.. దొంగలందు.. మహా దొంగలు వేరయా..! అన్నట్లు కొందరు ఎలాంటి జంకు బొంకు లేకుండా చోరీలకు పాల్పడి ఎంచక్కా తప్పించుకుంటారు. ఇంకొందరు ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల వెంటనే దొరికిపోతారు. ఇక్కడ కూడా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. చిన్న వాటర్ బాటిల్ కొనడానికి వచ్చి ఏకంగా మొబైల్ ఫోన్ చోరీకి పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో చాలా స్పష్టంగా రికార్డయ్యాయి.