హైదరాబాద్ః మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కలిశారు. రాజ్ భవన్‌లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రామ్‌నాథ్ కోవింద్‌కు శాలువ కప్పి సత్కరించారు. వీరిద్దరు కాసేపు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. కాగా , జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌ను చెన్నమనేని విద్యాసాగర్ రావు సమావేశమవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం వీరు రాజ్‌భవన్‌లో కలిసి విందు ఆరగించారు