భార్యపై ప్రేమతో ఓ భర్త ఏం చేశాడంటే..? ఇష్ట పడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దల దీవెనలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ పెళ్లికి ఆ దేవతల ఆశీస్సులతో ఒక పాప కూడా జన్మించింది. ఎంతో ప్రేమగా జీవించే ఈ కుటుంబానికి వాళ్ళే ప్రపంచం. ఎన్నడు ఒకరిని విడిచి మరొకరు లేరు. ఎంతో సంతోషంగా గడిపే ఆ కుటుంబానికి విధి వక్రించింది. అనుకోని ఘటనతో భార్యను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్ళింది. తన భార్య...తన కుటుంబం సర్వస్వం అనుకున్న ఆ భర్తకు ఎంతో ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య అనంతలోకాలకు వెళ్ళడం తనను కుంగిపోయేలా చేసింది. తన భార్య పై ప్రేమను ఎన్నటికీ వీడను అనేలా.. భార్య చేతిలో చెయ్యి వేసి.. హ్యాండ్ కాస్టింగ్ చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నాడు.