తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఆరు గ్యారెంటీల హామీలతో ప్రజల్లోకి దూసుకెళ్తోంది. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తొలి ఉద్యోగం నీకే ఇస్తానంటూ హామీనిచ్చారు.