పోయినసారి ఒక్క ఓటుతో ఓడిపోయాడు.. కట్ చేస్తే.. ఈసారి డబ్బాలతో నామినేషన్‌కు..

గత ఎన్నికల్లో ఒక్క ఓటుతో ఓటమి ఆ అభ్యర్థిని వెంటాడింది.. అందుకే మళ్లీ ఎలాగైనా గెలవాలని డిపాజిట్ కోసం ఒక్కో రూపాయి జమ చేసుకున్నాడు. అలా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా మొత్తం ఒక్క రూపాయి బిళ్లలతోనే నామినేషన్ వేశాడు. ఇలా వార్డ్ మెంబర్‌గా ఓడిపోయిన ఆ యువకుడి పొలిటికల్ స్టోరీ.. ఇప్పుడు అధికారులతో పాటు.. స్థానికులను ఆకట్టుకుంది.