డీజిల్ క్యాన్‌తో వెళుతున్న ఒక బైక్ హఠాత్తుగా వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొంది. అంతే బైక్ కింద పడి డీజిల్ క్యాన్ పగిలి క్షణాల్లో మంటలు వ్యాపించాయి. డీజల్ తీసుకెళ్తున్న బైక్ అగ్నికి ఆహుతి అయిపోయింది. అయితే త్రుటిలో ప్రమాదం తప్పింది.