ఒకే విమానంలో నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్

ఢిల్లీలో ఎన్డీయే, ఇండి కూటమిల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు రెండు కూటమిలకు చెందిన నేతలు ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు నితీశ్ కుమార్ ఢిల్లీ చేరుకున్నారు. అలాగే ఇండి కూటమి సమావేశానికి హాజరయ్యేందుకు తేజస్వి యాదవ్ బయలు దేరారు. అయితే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీ చేరుకున్నారు.