నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఖైదీతో మహిళ సరసాలు

నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జీవిత ఖైదు అనుభవస్తున్న వ్యక్తితో ఓ మహిళ సరసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆసుపత్రిలో ఖైదీతో ఉన్న అరుణ అనే మహిళ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ ఆరోపణలు వచ్చాయి. నెల్లూరు జిల్లాకు చెందిన అరుణ అనే మహిళ పోలీసు ఉన్నతాధికారులతో ఉన్న పరిచయాలతో ఖైదీని బయటకు రప్పించింది అన్న ఆరోపణలు సంచలనంగా మారాయి..