ఒకవైపు మొంథా తుఫాను గాలులు.. మరోవైపు వరద ప్రవాహం.. కనుచూపు మేర ఎటు చూసినా నీరే.. కట్ చేస్తే తుఫాన్ గాలుల ధాటికి కట్టిన తాళ్ళు తెంచుకొని వేగంగా సంఘం బ్యారేజ్‌వైపు మూడు ఇసుక బోట్లు దూసుకొచ్చాయి.. అంతలోనే గాలి దిశ మారడంతో క్షణాల్లో మరో పక్కకు వెళ్లిపోయాయి.. ఒక వేళ ఆ బోట్లు అంతే వేగంగా వచ్చి సంఘం బ్యారేజి గేట్లను ఢీ కొట్టి ఉంటే.. అలాంటి ఆలోచనే కాసేపు జిల్లా వాసులు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ సంఘటనతో మరోసారి అందరికీ ప్రకాశం బ్యారేజి ఘటన గుర్తుకొచ్చింది.