మేకలు, గొర్రెలకు మేతగా కమ్మటి కొత్తిమీర.. సాగు చేసిన రైతుల కంట కన్నీరు.. ఆ కారణంతోనే దిగాలు

కొత్తిమీర ఆకు లేనిదే ఏ వంటకు రుచి రాదు. అన్ని వంటల్లో తప్పనిసరిగా కొత్తిమీర ఉండాల్సిందే.. అందుకే కొత్తిమీరకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ, కొత్తిమీర పంటను సాగు చేసిన రైతులకు మాత్రం కొత్తిమీర కన్నీటిని మిగులుస్తుంది. మార్కెట్లో కొత్తిమీర కు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతన్నల్లు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నారు.