పెళ్లి పేరిట మోసగించి నగలు, డబ్బుతో ఉడాయించే నిత్య పెళ్లి కూతుళ్ల కథలు మీరిప్పటి వరకూ చాలానే విని ఉంటారు. ఇలాంటి కేసుల్లో నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు పంపించారు కూడా. తరచూ ఈ విధమైన సంఘటనలు రాజస్థాన్, హర్యానాలలో జరుగుతుంటాయి. కానీ ఈ వీరనారీమణి కథ వింటే మీరు పక్కా పరేషాన్ అవుతారు. స్కెచ్ అలాంటిది మరీ. ఓ యువతి ఆరేళ్లలో ఏకంగా ఏడు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురితో పెటాకులు కూడా చేసుకుంది. అయితే తనకు న్యాయం చేయాలంటూ ఏడుపులంకించుకుని కోర్టుకెక్కింది.