నే తాగితే.. సస్పెండ్ అవుతా..! మద్యం మత్తులో అధికారులు పరిసరాలనే మరిచిపోయారు.. స్థానికులతో కలిసి నానా హంగామా చేశారు. నల్లమలలో ఉన్న అతి పవిత్ర ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించని అధికారులు స్థానికులతో కలిసి ఇలా తాగి స్టెప్పులు వేశారు. శబ్ద కాలుష్యం వెదజల్లుతూ విందులు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నల్లమల అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ పరధిలో స్థానికులతో కలిసి ఫారెస్ట్ అధికారులు మందు తాగి పాటలకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.