CM రేవంత్‌రెడ్డి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో తొలిసారిగా సమావేశం కానున్నారు. కలెక్టర్లు, ఎస్పీలకు వివిధ అంశాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు.