సాధారణంగా రోడ్డుపై తిరిగే కుక్కలకు ఏవైనా ఆహారం డబ్బాలు కనిపిస్తే.. వెంటనే వాటి దగ్గరకు వెళ్లి వాసల చూసి.. వాటిలో ఉన్న పదార్థాలను తినడం అలవాలు.. ఇలానే ఒక డబ్బాలో ఉన్న ఆహారాన్ని తినేందుకు వెళ్లిన ఒక శునకానికి ఊహించని పరిణామం ఎదురైంది. అది డబ్బలో తన పెట్టగానే.. అందులో తల ఇరుక్కుపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరులో ఓ వీధి కుక్క ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో ఏదో తిందామని తల పెట్టింది. అయితే అనుకోకుండా కుక్క తల ఆ డబ్బాలో ఇరుక్కుపోయింది. దీంతో కుక్క కంగారుపడి ఇరుక్కున్న డబ్బాలో నుంచి తలను వదిలించుకోవాలని ఊరు మొత్తం పరుగులు తీసింది. ఆ కుక్కకు సాయం చేయాలని చూసిన కాలనీ వాసులను చూసి అది మరింత భయపడింది.