దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈశాన్య ఢిల్లీకి చెందిన సోనియా విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వజీరాబాద్ మల్ఖానాలో ఆదివారం అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 350 వరకు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి ఒకరు తెలిపారు.