వామ్మో.. కింగ్ కోబ్రా అమాంతంగా మింగేసింది...! పన్నెండడుగుల భారీ కింగ్ కోబ్రా... దాదాపు ఐదడుగుల పొడవున్న జెర్రిగుడ్డు..! రెంటిమధ్య కొద్దిసేపు పోరాటం. జీవన పోరాటం ఒక పాముదైతే.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం..! కానీ.. చివరకు కింగ్ కోబ్రా ముందు జెర్రిగుడ్డు తలవంచక తప్పలేదు. జెర్రిగుడ్డును అమాంతంగా మింగేసింది ఆ భారీ గిరినాగు. అనకాపల్లి జిల్లాలోని వి.మాడుగుల మండలం రామచంద్రపురంలోని పొలంలో ఈ ఘటన జరిగింది.