'దేవర సినిమా చూసి చచ్చిపోతా..' క్యాన్సర్ పేషెంట్ ఆఖరి కోరిక

జూనియర్‌ ఎన్టీఆర్‌ లేటెస్ట్ మువీ 'దేవర' చూసేంత వరకు బతికించండంటూ 19 యేళ్ల యువకుడు వైద్యులను వేడుకుంటున్నాడు. బ్లడ్‌ కేన్సర్‌ రోజురోజుకీ ఆయువును కబలిస్తుంటే.. ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన సదరు యువకుడు మాత్రం చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని, అదే తన చివరి కోరిక అని తల్లిదండ్రులను కోరాడు. కుమారుడి వేదన చూడలేక 'నా బిడ్డను బతికించండయ్యా' అంటూ ఆ యువకుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.