ప్రభుత్వంపై విద్యార్థిని ప్రశ్నల వర్షం.. వీడియో వైరల్

రాజస్థాన్‌లోని సీకార్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె "నేతాజీ మీరు ఎంజాయ్ చేయండి... మేమూ మీతోనే ఉన్నాం" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. బ్యాగ్ పట్టుకొని నీటిలో నడుస్తూ.. తన గ్రామ అభివృద్ధిపై అసహనం వ్యక్తం చేసింది. చెత్త రహదారులు, తాగునీటి కష్టాలు, విద్యుత్ అంతరాయం, పాఠశాలల్లో లోపాలు వంటి పలు కీలక సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించింది.