ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమూల్ సంస్థ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. అమూల్ ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవ వేడుకలను అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమూల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు.