ఘోరం.. పోలీసుల పెట్రోలింగ్ బైక్‌పై దూసుకెళ్లిన కారు..

కామారెడ్డి జిల్లా గాంధారిలో ఘోర రోడ్డు ప్రమాదం చెటుచేసుకుంది. స్పీడుగా దూసుకొచ్చిన కారు పోలీసుల పెట్రోలింగ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు.. మరో కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి..