గత రెండు మూడు రోజులుగా కురిసి భారీ వర్షాలతో మూసీ ఉగ్ర రూపం దాల్చింది. మూసీ నది నుంచి వస్తున్న వరద హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసింది. నగరంలోనూని మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు మొత్తం వరద నీటిలో ముగినిపోయాయి. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల సహాయంతో ఆహార పదార్థాలు సరఫరా చేస్తున్నారు.