వామ్మో ఇంతుందేంది భయ్యా.. ఇలాంటి పామును మీరు జన్మలో చూసుండరు

ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని పద్మపోఖరి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గ్రామ సమీపంలోని చెట్టు కింద నుండి చెరువు వైపు పాకుతున్న పెద్ద పామును చూశారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, స్నేక్ క్యాచర్‌ను తీసుకొని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువువైపు వెళ్తున్న 14 అడుగుల కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత కింగ్ కోబ్రాను సిమిలిపాల్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి సురక్షితమైన, ఏకాంత ప్రాంతంలో వదిలారు.